సమంత- నాగచైతన్య విడాకులపై నాగార్జున ఎమోషనల్ !

-

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య మరియు హీరోయిన్ సమంత విడాకులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. సమంత, నాగ చైతన్య విడాకులపై తాజాగా కింగ్ నాగార్జున స్పందించారు. చైతు, సమంత విడిపోవడం చాలా బాధా కరమైన విషయమని నాగార్జున ఎమోషనల్ అయ్యారు. భార్య, భర్తల మధ్య జరిగినవి… వ్యక్తిగతం మరియు అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు నాగార్జున.

సామ్ – నాగచైతన్య ఇద్దరూ అంటే తనకు చాలా ఇష్టమని… సమంత తమ ఫ్యామిలీ తో ఉన్న రోజులన్నీ అద్భుత తీపి గుర్తులు అని తెలిపారు నాగ్. సమంత, నాగ చైతన్య నిండు నూరేళ్లు… ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. ఇద్దరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని నాగార్జున పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా చెప్పారు నాగార్జున. కాగా తమ వివాహ బంధంపై ఇవాళ నాగ చైతన్య..  ట్వీట్ చేశాడు. సమంత, తాను విడాకులు తీసుకోబోతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు నాగచైతన్య. సమంత నేను విడిపోతున్నామని.. సమంతతో పదేళ్ళ స్నేహానికి ముగింపు చెబుతున్నట్లు పేర్కొన్నాడు నాగ చైతన్య. క్లిష్ట పరిస్థితుల్లో తన వెంట ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news