నాగార్జున సాగ‌ర్ కు జ‌ల‌క‌ళ

-

రాష్ట్రంలో అతిపెద్ద జలాశయమైన నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి వరదనీటి రాక ప్రారంభమైంది. ప్రస్తుతం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయ వివరాలు పరిశీలిస్తే సాగర్ డ్యామ్ పూర్తి స్థాయినీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 508.10 అడుగులు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం 128.4669 టీఎంసీలు సామర్థ్యం కలిగి ఉంది. ఈ రోజు సాగర్‌కు వస్తున్న ఇన్ ఫ్లో 46,626 క్యూసెక్కులు. సాగర్ నుంచి బయటికి పోతున్న అవుట్ ఫ్లో 810 క్యూసెక్కులు. ఇక సాగర్‌కు పైనున్న శ్రీశైలం జలయాశయం వివరాలను పరిశీలిస్తే…

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 2.59 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 866.8 అడుగులుగా ఉంది. జలాశయ పూర్తి స్థాయి నీటిసామర్థ్యం 215.81 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిల్వ 129.15గా నమోదైంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. హంద్రీనీవాకు 1,031 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలయాశయానికి ఈ రోజు వస్తున్న విధంగా ఇన్‌ఫ్లో మరో రెండు రోజులు కొనసాగినట్లయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం పైనున్న జురాల వివరాలు తెలుసుకుందాం..

జూరాలకు భారీ వరద !

కృష్టా పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 2.60 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 2.62 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 8.690 టీఎంసీలుగా ఉంది. మరోవైపు జురాల ఎగువన ఉన్న ఆల్మట్టికి జలాశయానికి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టికి 2,79,332 ఇన్‌ఫ్లో ఉండగా.. 3,20,535 క్యూసెక్కుల నీటిని కిందికి వదులు తున్నారు. జలాశయ పూర్తి స్థాయి సామర్థ్యం 123.081 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 98.859 టీఎంసీలుగా నమోదైంది. తాజా సమాచారం ప్రకారం జురాల నుంచి శ్రీశైలానికి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని డిసార్జ్ చేస్తున్నారు. దీంతో రేపోమాపో శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకోనున్నది. ఇదే ఇన్‌ఫ్లోలు మరో వారం పదిరోజులు కొనసాగితే సాగర్ జలాశయం కూడా ఆశించిన స్థాయికి నీటిమట్టం చేరే అవకాశం ఉందని జలనిపుణులు అశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news