సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాల్వకు 7086క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8090 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 2400 క్యూసెక్కులు, వరద కాల్వకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని అధికారులు తెలిపారు. మొత్తం 2876 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ఎగువ నుంచి ఎలాంటి నీటి రాక లేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు (312.0450టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 577అడుగులు(274.3640టీఎంసీలు)గా ఉంది.