ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17న 69 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పెంచడానికి నమో యాప్ యొక్క కొత్త వేగవంతమైన మరియు సొగసైన వెర్షన్ ప్రారంభించారు. నమో యాప్‌కు కొత్త అప్డేట్ వచ్చిందని పీఎం మోడీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. బెటర్, ఫాస్టర్, స్లీకర్ ట్యాగ్ లైన్‌తో నమో కొత్త యాప్ ఆవిష్కరించారు. యాప్‌లో నమో ఎక్స్‌క్లూజివ్ అనే కంటెంట్ సెక్షన్‌ను పొందుపరించారు.
అక్కడ మోదీకి సంబంధించి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ చూడొచ్చు. అలాగే వేగంగా బ్రౌజ్ చేసేలా కొత్త డిజైన్‌తో యాప్ రూపొందించారు. పాత వర్షన్ కంటే మరింత బెటర్‌గా మార్చేశారు. ఈ కొత్త వెర్షన్ యాప్ వెంటనే పొందండి అని మోడీ ట్వీట్ చేశారు. పీఎం మోడీ గురించి రోజువారీ అప్ డేట్స్ తెలుసుకోనేందుకు ఈ మొబైల్ యాప్ ప్రవేశపెట్టారు. మోడీ ఫాలోవర్ల కోసం నమో యాప్ లో కొత్త ఫీచర్లు రిలీజ్ అయ్యాయి.
వన్-టచ్ నావిగేషన్, ‘ నమో ఎక్స్‌క్లూజివ్ ‘ అని పిలువబడే కొత్త కంటెంట్ విభాగం మరియు వినియోగదారు ఆసక్తి ఆధారంగా కంటెంట్ సిఫార్సులు ఉన్నాయి. వినియోగదారులు ఇప్పుడు వివిధ విభాగాలలో ఎక్కువ కంటెంట్ యాక్సెస్ చేయడానికి స్లైడ్ చేయవచ్చు. 2015లో నరేంద్ర మోడీ ఈ నమో యాప్ ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ యాప్ కు వివిధ ప్లాట్ ఫాం నుంచి 1.5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.
అంతేకాదు నరేంద్ర మోదీ యాప్‌లో కేంద్రప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫోగ్రాఫిక్స్, మన్ కీ బాత్ ఎపిసోడ్స్, మోదీకి సంబంధించి వార్తలు లభిస్తాయి. ఇందులో నమో మర్కంటైజ్, మైక్రో డొనేషన్స్ వంటి సెక్షన్స్ కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ నుంచి నేరుగా సందేశాలను ఈ యాప్ ద్వారా అందరికి సులువుగా తెలుస్తోంది.