గతంలో నంది అవార్డుల పేరిట ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వంగా ఉన్న సమయంలో తెలుగు సినిమా పరిశ్రమలో వివిధ ప్రదర్శనలకు గాను అవార్డులను ప్రధానం చేసేవారు. ఈ నంది అవార్డుకు చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ గతంలో ఒక్కసారి నంది అవార్డులు ప్రదానంతో విమర్శలు, వివాదాలు జరిగినాయి. కాగా ప్రస్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్ కొన్ని కీలక ఆదేశాలను ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది. నంది అవార్డులను ఇవ్వడం రెండు తెలుగు రాష్ట్రాలలో గుర్తింపు పొందిన తెలుగు ఫైన్ ఛాంబర్ అఫ్ కామర్స్ మరియు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లకు మాత్రమే పూర్తి హక్కు ఉంది. కాగా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న నంది అవార్డులు ప్రదానోత్సవం ఇన్ దుబాయ్ పూర్తిగా ప్రయివేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నది అందరూ గుర్తించాలి. ప్రధాని రామకృష్ణ గౌడ్ ఒక ప్రయివేట్ సంస్థగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అఫ్ కామెర్స్ పేరుతో నంది అవార్డులను ఇవ్వడానికి ప్లాన్ చేశారు. ఈ ప్రయత్నాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ గా తీవ్రంగా ఖండిస్తున్నాము అంటూ తెలిపింది.
“నంది అవార్డ్స్” పేరిట ప్రైవేట్ వ్యక్తులు పురస్కారాలు ఇవ్వకూడదు: తెలుగు ఫిలిం ఛాంబర్ ఆదేశాలు
-