సినిమా పరిశ్రమ అంటేనే కాస్టింగ్ కౌచ్ కు నెలవు అని చెప్పాలి. గతంలో కూడా చాలా మంది హీరోయిన్ ల విషయంలో ఇలా జరిగినా ఎవ్వరూ బయట చెప్పుకునే సాహసం చేయలేదు. అయితే శ్రీరెడ్డి ఎప్పుడు అయితే బయట చెప్పిందో అప్పటి నుండి ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సయామీ ఖేర్ తనకు జరిగిన ఒక వ్యక్తిగత విషయాన్ని చెప్పింది. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో సయామీ ఖేర్ ను ఉద్దేశించి కొందరు డైరెక్టర్లు మరియు నిర్మాతలు నీ పెదాలు మరియు ముక్కు సైర్గ లేవు.. నీకు ఆఫర్లు రావాలంటే సర్జరీ చేయించుకోవాలంటూ చాలా మంది తప్పుడు సలహాలు ఇచ్చారని పేర్కొంది. కానీ ఈ విషయాలేవీ నేను పట్టించుకోలేదు అంటూ సయామీ ఖేర్ తాను లేటెస్ట్ గా నటించిన గూమర్ సినిమా ప్రమోషన్స్ లో బయటపెట్టింది.