ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో ఉన్న ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్లను నిర్మించడానికి సీఎం జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే, ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం చాలా సాలిడ్ కమిట్మెంట్ తో ఉంది. ప్రతిపక్ష టీడీపీ ఈ విషయంపై కోర్ట్ లో కేసులు వేయడంతో ప్రస్తుతానికి క్లియరెన్స్ వచ్చే వరకు ఇక్కడ నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదు. కాగా ఈ విషయంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈమె కాసేపటి క్రితమే మాట్లాడుతూ .. ఆర్5 జోన్ అంశం కోర్ట్ లో పెండింగ్ ఉన్నందున ఎటువంటి పరిస్థితుల్లో తుది తీర్పు వెలువడే వరకు నిధులు ఇవ్వడం కుదరదు అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. వైసీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని వదిలేసి పేదలకు తమ సొంత ప్రాంతాలలో కోర్టుకు అభ్యంతరం లేని ప్రాంతాలలో ఇల్లు నిర్మించి ఇస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందని పురందేశ్వరి తెలిపింది.
కోర్ట్ తీర్పు ఇచ్చే వరకు నిధులు ఇవ్వడం కుదరదు: ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి
-