Nani29 : ఈ “దసరా” నిరుడు లెక్క ఉండదు

-

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ మధ్య టక్ జగదీష్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఓటీటీ ద్వారా అలరించగా మరోవైపు శ్యామ్ సింగ రాయ్ తో థియేటర్ లో జనాలను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు నాని. ఇక తాజాగా దసరా పండుగ నేపథ్యంలో మరో కొత్త సినిమాలు అనౌన్స్ చేశాడు నాచురల్ స్టార్ నాని.

ఈ దసరా నిరుడు లెక్క ఉండదు అంటూ కొత్త సినిమా టైటిల్ పోస్టర్ వదిలాడు. అలాగే ఈ సినిమా కాన్సెప్ట్ గురించి చింతిస్తూ గేమ్స్ కూడా విడుదల చేశారు. చిత్తుచిత్తుల బొమ్మ తో మొదలవుతుంది పాతకాలంనాటి రైలును, నాని మరియు కీర్తి సురేష్ కు చూపించారు.

ఇక చివర్లో” ఈ దసరా నీరుడు లెక్క ఉండదు బంచత్… జమ్మి పెట్టి చెప్తన్న… బద్ధలు బాసింగాలు అయితాయి. ఎట్లయితే గట్లానే… చూసుకుందాం” అన్న తెలంగాణ యాసలో డైలాగ్ ఇరగదీశాడు నాని. ఇక ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news