మన ఇండియా వ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిన సంగతి తెలిసిందే. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ఇక సామాన్య ప్రజలు అయితే… తమ వాహనాలు పక్కకు పెట్టి.. ఆర్టీసీ బస్సులు మరియు రైళ్ళలో ప్రయాణం చేస్తున్నారు.
అయితే ఇది ఇలా ఉండగా ఇవాళ దేశంలో మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలోలీటర్ పెట్రోల్ ధర రూ. 105.49 కు చేరగా డీజిల్ ధర రూ. 94.22 కు పెరిగింది.
అలాగే హైదరాబాద్ నగరం లో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.73 కు చేరగా డీజిల్ ధర రూ. 102. 80 కు పెరిగింది. ముంబై లో రూ. 111. 53, కు చేరగా డీజిల్ ధర రూ. 102 . 15 కు పెరిగింది. కోల్ కతా రూ . 106 . 10 కు చేరగా డీజిల్ ధర రూ. 97. 33 కు పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111. 86 కు చేరగా డీజిల్ ధర రూ. 104. 34 కు చేరుకుంది.