కలిసి రాకున్నా.. పట్టు విడువని నాని.. మరోసారి..!?

గతంలో కృష్ణార్జున యుద్ధం అనే సినిమాతో నాని ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే… అయితే ద్విపాత్రాభినయం చేసి తన నటనతో ఆకట్టుకున్నప్పడికి ఎందుకొ నన్నునాని మాత్రం విజయం సాధించలేకపోయాడు. ద్విపాత్రాభినయం చేసిన మొదటి సినిమాతోనే నానికి నిరాశే ఎదురైంది అయినప్పటికీ పట్టువిడవకుండా నాని మరోసారి ద్విపాత్రాభినయం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న నాచురల్ స్టార్ నాని ఆ తర్వాత రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నాడట నాచురల్ స్టార్ నాని. ఓ పాత్ర 1960 నాటి పాత్ర అయితే మరొకటి ప్రజెంట్ జనరేషన్ కు సంబంధించిన పాత్ర అని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రస్తుతం నాని అభిమానుల్లో మరోసారి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈసారైనా నాచురల్ స్టార్ నాని ద్వి పాత్రాభినయం కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి మరి.