నటీనటులు : నాని, నివేదా థామస్, సుధీర్ బాబు, అదితి రావ్ హైదరి, జగపతి బాబు తదితరులు
సినిమాటోగ్రఫర్ : పి.జి.విందా
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం : అమిత్ త్రివేది – థమన్
నిర్మాత : దిల్ రాజు
స్క్రీన్ ప్లే – దర్శకత్వం : మోహన్ కృష్ణ ఇంద్రగంటి
రిలీజ్ డేట్: 05, సెప్టెంబర్, 2020
నేచురల్ స్టార్ నాని, మరో యంగ్ హీరో సుధీర్‌భాబు కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా వి. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో నివేద థామస్, అదిథిరావు హైదరీ హీరోయిన్లు. వైవిధ్యమైన సినిమాల దర్శకుడిగా మంచి పేరున్న మోహన్‌కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉన్నా లాక్‌డౌన్ వాయిదాలతో ఈ రోజు ఎట్టకేలకు అమోజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. మరి వీ అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం.
కథ:
ఈ కథ గురించి సింపుల్‌గా చెప్పాలంటే విష్ణు ( నాని) అనే ఆర్మీ ఆఫీసర్ వర్సెస్ డీసీపీ ఆదిత్య ( సుధీర్‌బాబు ) మధ్య జరిగే సవాల్, ప్రతిసవాల్. ఆర్మీలో పేరున్న విష్ణు ఇన్‌స్పెక్టర్‌ను చంపడంతో పాటు మరో నలుగురిని కూడా చంపేస్తానని డీసీపీ ఆదిత్యకు సవాల్ చేస్తాడు. ఇక సక్సెస్ ఫుల్ ఆఫీసర్‌గా డిపార్ట్‌మెంట్‌లో ఎంతో మంచి పేరున్న ఆదిత్య ఈ ఛాలెంజ్‌ను సవాల్‌గా తీసుకుంటాడు. ఆదిత్య స్టోరీ రాసేందుకు వచ్చిన క్రైం స్టోరీ రైటర్ అపూర్వ ( నివేద) అతడితో ప్రేమలో పడుతుంది. ఇక విష్ణు చేసిన ఈ సవాల్‌లో విష్ణు గెలిచాడా ? లేదా ఆ హత్యలు జరగకుండా ఆదిత్య ఆపాడా ? విష్ణుకు సాహెబా (అదితి రావ్ హైదరి) కు ఉన్న లింకులేంటి ? గతంలో విష్ణు, ఆదిత్య మధ్య ఉన్న లింక్ ఏంటి ? అన్నదే ఈ సినిమా.
నటీనటు పెర్పామెన్స్ :
నాని మరోసారి తన సహజసిద్ధమైన నటనతో తనకు ఉన్న నేచురల్ స్టార్ బిరుదు సార్థకం చేసుకున్నాడు. నెగిటివ్‌షేడ్స్‌లో ఆయన నాని యాటిట్యూడ్, పెర్పామెన్స్, మ్యానరిజమ్స్‌కు ఫిదా అయ్యేవాళ్లు నాని రోల్‌కు బాగా కనెక్ట్ అవుతారు. ఇక సుధీర్‌బాబుతో ఎత్తులు, పై ఎత్తులకు సంబంధించిన సీన్లలో నాని నటన సూపర్బ్. నాని నటన మాత్రమే ఈ సినిమాను నిలబెట్టిందని చెప్పాలి. క్లాసిక్ విలనిజమ్ తో నాని కొత్తగా కనిపించాడు. ఇక సుధీర్‌బాబుతో ఇంద్రగంటి సమ్మోహనం సినిమా చేశాడు. ఆ సినిమాలో కంప్లీట్ లవర్‌బాయ్‌గా నటిస్తే ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, డీసీపీ రోల్లో మంచి హీరోయిజం చూపించాడు. ఇక నాని, సుధీర్‌బాబు మధ్య వచ్చే యాక్షన్, ఛేజింగ్ సీన్లు స్పెషల్ ఎట్రాక్షన్.
ఇక నివేద తన పాత్రలో సింపుల్‌గా నటించింది. నాని, నివేద మధ్య వచ్చే లవ్ సీన్లు మాత్రం పాత సినిమాల వాసననే గుర్తు చేస్తూ ప్రేక్షకులను బోర్ కొట్టిస్తాయి. ఇక మరో హీరోయిన్ అదితిరావ్ తన పాత్రకు న్యాయం చేసింది. హీరోయిన్లు ఇద్దరూ అందంగా కనిపించడంతో పాటు నటనకు న్యాయం చేశారు. ఇక వెన్నెల కిషోర్ పంచ్‌లు బాగున్నాయి.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్ :
టెక్నికల్‌గా ఈ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ సినిమాకు సౌండ్ ఎఫెక్ట్స్, పీజీ విందా విజువల్స్‌కు మాత్రం మంచి మార్కులు వేయాలి. రోజు చూసే విజువల్స్‌నే చాలా కొత్తగా ప్రజెంట్ చేసిన ఫీలింగ్ సినిమాటోగ్రఫీలో మనకు కనిపిస్తుంది. సౌండ్ కూడా మంచి థ్రిల్ ఇచ్చింది. ఇక సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవడానికేం లేదు. రెండు పాటలు మినహా థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతంతో సహా అంతా ఆకట్టుకోలేదు. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌లో చాలా చోట్ల పాత వాసనలే దంచి కొట్టాయి. మార్తాంకె. వెంకటేష్ ఎడిటింగ్‌లో క్రిస్పీనెస్ మిస్ అయ్యింది. రవివర్మ ఫైట్స్‌లో ఒక్కటీ ఆకట్టుకోలేదు. దిల్‌రాజు నిర్మాణ విలువలు సూపర్.
ఇక కెప్టెన్ ఆఫ్ ద షిఫ్ అయిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తన గత సినిమాలతో పోలిస్తే చాలా వీక్ కథ, కథనాలను ఈ సినిమాకు ఎంచుకున్నాడు. గతంలో ఆయన సినిమాలు ప్లాప్ అయినా కథకుడిగా, దర్శకుడిగా ఆయనకు ఎప్పుడూ మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమాకు ఇంత బోరింగ్ కథ ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలేదు. ఇక కథనం కూడా చాలా స్లోగా సాగుతూ ఒకానొక దశలో ప్రేక్షకుడికి బోర్ కొట్టించేసింది. గతంలో జరిగిన ఓ సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నానని ఆయన చెప్పినా ఎక్కడా ఎమోషనల్‌గాను, ఇంట్రస్టింగ్‌గాను కథను ప్రేక్షకుడికి కనెక్ట్ చేయలేకపోయాడు. సినిమా చూసిన వాళ్లలో చాలా మంది ఆయన కెరీర్‌లోనే వీక్ కథ ఇదే అంటోన్న పరిస్థితి ఉంది.
కేకే పెట్టించేవి :
– నాని నటన
– నాని వర్సెస్ సుధీర్‌బాబు చేజింగ్‌లు
– విజువల్స్
బోర్ కొట్టించేవి :
– రొటీన్ కథ
– నత్త నడక కథనం
– ఫైట్స్
– డైరెక్షన్
– మ్యూజిక్
మన లోకం తుది తీర్పు :
వి సినిమా రిలీజ్‌కు ముందు టీజర్, ట్రైలర్లతో ఎన్ని అంచనాలు ఉన్నాయో అవన్నీ సినిమా చూశాక ఒక్కసారిగా నీరుగారిపోతాయి. నాని వీరాభిమానులకు, యాక్షన్ సినిమాలు చూసే వారికి మినహా ఏ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. లాక్ డౌన్ వేళ ఇంట్లో మరీ బోరింగ్ ఉంటే ఓ సారి చూడొచ్చు.. అంతకు మించి ఆశించలేం.
వీ మూవీ మనలోకం రేటింగ్: 2 / 5
-vuyyuru subhash