ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పటినుంచంటే..?

-

బాహుబలి వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, చ‌రణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడింది.

ఈ సినిమా కోసం ప‌ని చేస్తున్న రాజ‌మౌళి, కీర‌వాణి, దాన‌య్య క‌రోనా బారిన ప‌డ‌డంతో గ‌త ఐదు నెల‌లుగా సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తిగా ఆగింది. అయితే ద‌స‌రా త‌ర్వాత అన్ని జాగ్ర‌త్త‌లతో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో జక్కన్న ఉన్న‌ట్టు తెలుస్తుంది. హైద‌రాబాద్‌లోనే ప్ర‌త్యేక సెట్ లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది‌. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో షూటింగ్ చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news