రేపటి నుంచే లోకేష్ పాదయాత్ర…చంద్రబాబు కుటుంబం భావోద్వేగం

-

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని తన నివాసంలో లోకేష్ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.

లోకేష్ ను తల్లిదండ్రులు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, అత్తమామలు నందమూరి బాలకృష్ణ, వసుంధర ఆశీర్వదించారు. భార్య బ్రాహ్మణి లోకేష్ కు వీర తిలకం దిద్ది హారతి ఇచ్చారు. ఇతర కుటుంబ సభ్యులు లోకేష్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఈ సందర్భంగా నారా లోకేష్‌ కూడా ఎమోషన్‌ ట్వీట్‌ చేశారు. ఈరోజు నా జీవితంలో ఎంతో ఉద్విగ్నమైన క్షణాలను అనుభవించాను. జనం కోసం 400 రోజుల పాదయాత్రకు బయలుదేరేముందు కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెబుతుంటే మాటలకందని భావోద్వేగాలు మనసును ముంచెత్తాయి. దేవాన్ష్ కు ముద్దులు పెట్టి అమ్మానాన్నలకు పాదాభివందనం చేసానన్నారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version