దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) దీపికా పదుకొనేని విచారణకు పిలిచినా సంగతి తెలిసిందే. గురువారం తన భర్త రణవీర్ సింగ్‌తో కలిసి గోవా నుంచి ముంబై చేరుకున్నారు ఆమె. దీపికాను శనివారం కేంద్ర ఏజెన్సీ ప్రశ్నించబోతోందని మీడియా వర్గాలు అన్నాయి. అయితే ఆమె భర్తను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని అన్నారు.
ఎన్‌సిబికి పెట్టుకున్న అభ్యర్ధనలో ఆమె భర్త కొన్ని విషయాలు చెప్పినట్టు తెలుస్తుంది. దీపికా పదుకొనే కొన్నిసార్లు ఆందోళనతో బాధపడుతుంటారు అని, తీవ్ర భయాందోళనలకు గురవుతారు అని చెప్పాడు. అందువల్ల ఆమెతో కలిసి విచారణకు రావడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. నేడు రకుల్ ప్రీత్ సింగ్ ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తున్న సంగతి తెలిసిందే.