ఏకకాలంలో రియా టీమ్ మీద నార్కోటిక్స్ బ్యూరో రైడ్స్ !

-

సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మృతి కేసులో దర్యాప్తుకు సంబంధించి కొన్ని విషయాలు రాబట్టేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఈరోజు ముంబైలోని నటి రియా చక్రవర్తి నివాసానికి చేరుకుంది. రియా చక్రవర్తి సోదరుడు షోయిక్ చక్రవర్తి మరియు సుశాంత్ సింగ్ వద్ద హౌస్ కీపింగ్ మేనేజర్ గా పని చేసిన శామ్యూల్ మిరాండాల ఇళ్ల మీద కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం ప్రకారం ఏకకాలంలో రైడ్స్ జరుగుతున్నాయి.

శామ్యూల్ మిరాండాను రియా చక్రవర్తి గత ఏడాది మేలో సుశాంత్ కి హౌస్ కీపింగ్ మేనేజర్ గా నియమించారు. అతనే సుశాంత్ ఇంటి ఖర్చుల జమాపద్దులు చూసుకునేవాడు. రియా చక్రవర్తి సుశాంత్ డబ్బును కాజేయడానికి అలానే మాదకద్రవ్యాల సప్లైలో కూడా మిరాండా సహాయం చేశాడని సుశాంత్ ఫ్యామిలీ ముందు నుండీ ఆరోపిస్తోంది. రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్ కంట్రోల్ బోర్డ్ ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేసింది. ఇక ఈ కేసుని సిబిఐ కూడా విచారిస్తోంది. ఈ కేసుకు సంబంధించి రియా చక్రవర్తి సహా పలువురిని ప్రశ్నించింది. నిన్న రెండవ రౌండ్ విచారణ కోసం చక్రవర్తి తండ్రిని కూడా ఆఫీస్ కు పిలిపించుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news