పవిత్ర నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం.. లిప్ లాక్ తో షాక్ ఇచ్చిన నరేష్

-

చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రచారమే ఎట్టకేలకు నిజమైంది. సీనియర్ నటుడు నరేష్ ముచ్చటగా నాలుగో పెళ్లికి రెడీ అయిపోయాడు. ఇప్పటికే మూడుసార్లు వివాహం చేసుకున్న నరేష్ గత కొంతకాలంగా నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ మేము స్నేహితులం మాత్రమే అని చెప్పుకోవడానికి వారు ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వీరిద్దరిని మైసూరులో ఒక గదిలో ఉండగా పట్టుకున్న తర్వాత వీరు పబ్లిక్ లో ఎక్కువగా కనిపించడం తగ్గించారు.

ఇక తాజాగా పవిత్ర లోకేష్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఓపెన్ అయ్యారు. తమ బంధాన్ని రివ్యూ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా పేజీలో షేర్ చేశారు. ” కొత్త సంవత్సరం, కొత్త ఆరంభాలు, మీ అందరి ఆశీస్సులు కావాలి. మేమిద్దరం త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాం “. అని నరేష్ పేర్కొన్నారు. పవిత్ర లోకేష్ తో కలిసి కేక్ కట్ చేసి, ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటూ.. పనిలో పనిగా లిప్ కిస్ ఇస్తున్న వీడియోని పోస్ట్ చేసి షాక్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news