పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఆటోమాటిక్‌గా క్రేజ్ వుంటుంది.. ఆయన సినిమాలలో భారీ హిట్ ను అందుకున్న సినిమాలలో ఒకటి ఖుషి..ఈ సినిమా కథ పరంగా జనాలను బాగా ఆకట్టుకుంది..ఈ మూవీ రీరిలీజ్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. రాత్రి బెనిఫిట్ షో నుంచే బాణాసంచా కాల్చి రచ్చ చేస్తున్నారు..2001 లో విడుదలై మళ్లీ ఇన్నేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చినా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.
పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ థియేటర్లకు వెళ్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో అప్డేట్స్ వచ్చాయి. ఈ సినిమాని శ్రీసూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మించగా, ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో భూమిక హీరోయిన్‌గా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, డ్యాన్సులు, మేనరిజమ్స్ ..ఒక్కటి అని ప్రత్యేకంగా చెప్పలేము..పవన్ సినిమా అంటే ఎదో మాయ.. యూత్ ని ఓ రేంజ్ లో ఫిదా చేశాయి..
గత కొన్ని రోజులుగా ఈ సినిమాను రీరిలిజ్ చెయ్యనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము లేపిన ఈ చిత్రం. చిన్న సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లను కొల్లగొడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో సందడి చేస్తున్న ఈ మూవీ. ఇక ఫ్యాన్స్ హంగామాతో ఓ మానియాను క్రియేట్ చేస్తున్నారు. సుమారు 500 లకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీని అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.. ఇక పవన్ ఫ్యాన్స్ మాత్రం నానా రచ్చ చేస్తున్నారు.. ఏది ఏమైనా ఈ సినిమా మరోసారి బాక్సాఫిస్ వద్ద మంచి టాక్ ను అందుకుంది..కలెక్షన్స్ కూడా బాగానే వసూల్ చేస్తుందని తెలుస్తుంది..చూడాలి మరి ఎన్ని కోట్లు రాబడుతుందో..