మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిధులను మళ్ళించారు అంటూ నటి హేమ చేసిన ఆరోపణలపై నటుడు నరేష్ స్పందించారు. హేమ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న నరేష్…. హేమ ఆరోపణలు “మా”కుటుంబం ప్రతిష్ట దిగజార్చేలా ఉన్నాయని అని నిప్పులు చెరిగారు. హేమ వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. క్రమశిక్షణ కమిటీ నిర్ణయం మేరకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు నరేష్.
కరోనా నేపథ్యంలో మా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై… సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని నటుడు నరేష్ స్పష్టం చేశారు. ఇక టు జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… మా సమస్యలు మనలో మనమే చర్చించుకుందామని.. సమస్యలను మనలో మనమే పరిష్కరించుకోవాలి అనే నియమం ఎప్పటినుంచో ఉందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మీడియా ముందుకు రాక తప్పటం లేదని పేర్కొన్నారు. హేమ ఆరోపణలకు వివరణ ఇవ్వక పోతే.. అవి నిజం అనుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ నెల 22న జనరల్ బాడీ మీటింగ్ లో మా ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.