ఈ నెల 30న నాసా అంగారకుడిపైకి కొత్త యాత్రకు సిద్ధం..!

-

అంగారకుడి యాత్రకు మరోసారు సన్నద్ధమవుతోంది నాసా. ఇప్పటివరకు 8సార్లు విజయం సాధించిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. తాజాగా ఈ నెల 30న మరో రోవర్​ను అంగారకుడి వద్దకు పంపనుంది. అంగారకుడిపై ఇప్పటి వరకు జరిపిన ప్రయోగాల్లో ఈ “పెర్​సీవరెన్స్​” అతిపెద్దదని, అత్యంత మేధస్సు కలిగినదని నాసా పేర్కొంది.

nasa
nasa

ఈ రోవర్​ ల్యాండింగ్​ కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించింది నాసా. ఇతర ప్రాజెక్టులతో పోల్చితే.. అంగారకుడిపై చిత్రాలు తీయడానికి, ధ్వనిని రికార్డు చేయడానికి ఇందులోనే ఎక్కువ కెమెరాలు, మైక్రోఫోన్లు అమర్చింది. గ్రహంపై ఉన్న రాళ్లను సేకరించే ట్యూబులు కూడా అత్యంత శుభ్రమైనవని వెల్లడించింది నాసా.ఇతర స్పేస్​క్రాఫ్ట్​ల లాగే పర్​సర్వెన్స్​ కూడా 300 మిలియన్​ మైళ్లుకన్నా ఎక్కువ దూరం ప్రయాణించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంగారకుడిపై అడుగుపెట్టే అవకాశముందని శాస్త్రవేత్తలు తెలిపారు.ఈ ఆరు చక్రాల పెర్​సీవరెన్స్​.. నాసా ప్రతిష్టాత్మక “క్యూరియాసిటీ” రోవర్​తో పోలి ఉంటుంది. అయితే ఇది క్యూరియాసిటీ అప్​గ్రేడ్​ వర్షెన్​. దీని 7 అడుగుల రోబోటిక్​ ఆర్మ్​కు ఎంతో శక్తివంతమైనది. ఎంతో లోతుగా తవ్వి.. రాళ్ల నమూనాలను సేకరించే బలం దీని సొంతం. ఇన్ని విశిష్టతలున్న పెర్​సీవరెన్స్ ప్రాజెక్ట్​ కోసం నాసా 3 బిలియన్​ డాలర్లను వెచ్చించింది.

Read more RELATED
Recommended to you

Latest news