ఈ మధ్య కాలంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్ NPS) పథకంలో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. దీని వలన రిటైర్ అయ్యే సమయానికి అత్యధిక రాబడితో పాటు నెలవారీ పెన్షన్ పొందొచ్చు. అందుకే ప్రస్తుతం ఈ పథకంలో చేరేందుకు కార్పొరేట్ ఉద్యోగులు మొదలు ఎంతో మంది జాయిన్ అవుతున్నారు. అయితే మీరు కూడా ఈ స్కీమ్ లో చేరాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు కూడా ఈ విషయాలని తెలుసుకోవాలి. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూద్దాం.
అయితే స్కీమ్ ప్రిఫెరెన్సు చేంజ్ అనేది మునుపటి బిజినెస్ డే ముగిసిన తర్వాత అలానే తదుపరి బిజినెస్ డే ప్రారంభానికి ముందు అప్లై చేసుకుంటే.. ఒకరోజు సెటిల్మెంట్ జరుగుతుంది. మరొక మూడు రోజుల్లో ప్రిఫరెన్స్ చేంజ్ పూర్తిగా అమలు అవుతుంది. ఇది ఇలా ఉంటే నాలుగు ట్రాన్సాక్షన్ రోజుల్లో సవరించిన ‘పథకం ప్రిఫరెన్స్’ ప్రకారం యూనిట్లు చందాదారుల ఖాతాలో జమ అవుతాయి.
ఉదాహరణకి ఎవరైనా సరే పథకం ప్రిఫరెన్స్ రిక్వెస్ట్ ఏప్రిల్ 25న అధికారం పొందినట్లయితే.. పథకం సవరణ తదుపరి సెటిల్మెంట్ రోజున (ఏప్రిల్ 26) అమలు చేస్తారు. నెక్స్ట్ చందాదారుల పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ నుంచి యూనిట్లను విత్ డ్రా చేస్తారు. ఏప్రిల్ 26, 2018న పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ల ద్వారా యూనిట్లను రీడీమ్ చేస్తారు. అంటే ఏప్రిల్ 29న కొత్త పథకం ప్రిఫరెన్స్ ప్రకారం యూనిట్లు చందాదారుల ఖాతాలో పడతాయి.