జాతీయ యువజన దినోత్సవం 2021.. స్వామి వివేకానంద చెప్పిన శక్తివంతమైన మాటలు..

-

జనవరి 12, స్వామి వివేకానంద జయంతి. 1893 చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో మాట్లాడిన స్వామి వివేకానంద, ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఆ మీటింగ్ తర్వాత ప్రపంచం దృష్టి ఇండియాపై పడింది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని సంభోధించి తన ఉపన్యాసం ద్వారా యావత్ ప్రపంచానికి భారతీయత గురించి తెలియజేసాడు. ఈ రోజు స్వామి వివేకానంద పుట్టినరోజు. జాతీయ యువజన దినోత్సవం. దేశ భవిష్యత్ అంతా యువత మీదే ఆధారపడి ఉందని, అందువల్ల యువత ఆరోగ్యంగా ఉండాలని, ఉక్కు నరాలు, కండలతో దేహదారుఢ్యంతో దేశాన్ని పటిష్టం చేయాలని తెలిపాడు.

స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పిన శక్తివంతమైన మాటలు

రోజులో నీతో నువ్వు కనీసం ఐదు నిమిషాలైనా మాట్లాడుకోవాలి. లేదంటే అత్యంత తెలివితేటలున్న వ్యక్తితో మాట్లాడే అదృష్టం మిస్సయినట్టే.

నిన్ను నువ్వు నమ్మేంత వరకూ దేవుణ్ణి నమ్మలేవు.

ఈ ప్రపంచంలో నీకంటూ గురువు ఎవ్వరూ లేరు. నీలో నుండి వచ్చే ఆలోచనలే నిన్ను నిర్దేశిస్తాయి. అందుకే నీకు నువ్వే గురువు.

నువ్వేమీ ఆలోచిస్తావో ఆ విధంగానే తయారవుతావు. అందుకే ఏమి ఆలోచిస్తున్నావో చూసుకో. మాటలు తాత్కాలికమే. ఆలోచనలు శాశ్వతం. అవి చాలా దూరం ప్రయాణిస్తాయి.

సత్యం వెయ్యి రకాలుగా చెప్పవచ్చు. అయినప్పటికీ ప్రతీదీ సత్యమే.

అసాధ్యం అని ఎప్పుడూ ఆలోచించకు. బలహీనులు మాత్రమే మాకేమీ చేతకాదని ఆలోచిస్తారు. బలవంతుడి నోట అసాధ్యం అన్నమాట రాదు.

ఒక ఆలోచన తీసుకోండి. ఆ ఆలోచన మీ జీవితం అవ్వాలి. మీ కండరాలు, మీ నరాలు, మీ మెదడు మొత్తం ఆ ఆలోచన చుట్టూ తిరగాలి. ఇంకా మిగతా ఆలోచనలని పూర్తిగా పక్కకి పెట్టండి. విజయానికి దగ్గరి దారి ఇదే.

 

Read more RELATED
Recommended to you

Latest news