షిరిడీ వెళ్లాలనుకునే వారు ఇది తప్పక చదవండి..మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని షిర్డీలో ఉన్న ప్రఖ్యాత సాయి బాబా ఆలయాన్ని సందర్శించే వారు అందరూ ఇక మీదట ఆన్ లైన్ లోనే పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా రద్దీని నివారించడానికి ‘దర్శనం’ మరియు ‘హారతి’ కోసం ఆన్‌లైన్‌లో పాస్‌లు పొందాలని ప్రజలను షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ కోరింది. ఆన్‌లైన్ పాస్‌లపై నిర్ణయం జనవరి 14 నుంచి అమలు చేయనున్నట్లు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పాస్ లను ఆలయ అధికారిక వెబ్‌సైట్ నుండి పొందవచ్చని చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఆలయానికి రద్దీని నియంత్రించడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా గురువారం, వారాంతాలు, అలానే కొన్ని పండుగ రోజులు, అలానే ప్రభుత్వ సెలవు దినాలలో రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉచిత మరియు రెండు వందల రూపాయల పాస్ కేంద్రాలు మూసివేయబడతాయి అని పేర్కొన్నారు.