పదేపదే భార్య పుట్టింటికి వెళ్లడం భర్తను హింసించడమే: హైకోర్టు

-

భర్త తప్పు లేకున్నా  భార్య మాటిమాటికీ పుట్టింటికి వెళ్లిపోతున్నట్లయితే అతడిని మానసికంగా హింసించినట్లేనని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ, విశ్వాసం, ఆరాధన భావన ఉంటే వారి వైవాహిక బంధం అన్యోన్యతలతో వికసిస్తుందని జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కైత్‌ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

సంయమనం కోల్పోయిన దంపతుల మధ్య ఎడబాటు పెరుగుతూపోతే వారు ఎన్నటికీ కలవలేనంతగా పరిస్థితి మారిపోతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భార్య హింస, క్రూరత్వ చర్యల కారణంగా విడివిడిగా ఉంటున్న దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

19 ఏళ్ల వైవాహిక జీవితంలో దాదాపు ఏడు సార్లు భార్య తనను వీడి వెళ్లిపోయిందని ఓ భర్త కోర్టుకు వెల్లడించారు. అలా వెళ్లిన ప్రతిసారీ పది నెలల పాటు పుట్టింటిలో ఉందనీ అన్నారు. కుటుంబ న్యాయస్థానం ఈ జంటకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించగా భర్త హైకోర్టును ఆశ్రయించడంతో హై కోర్టు విడాకులు మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version