రెండు రోజుల పర్యటనలో భాగంగా సూరత్ కి వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద భవనం మరియు వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన” సూరత్ డైమండ్ బోర్స్ “ని ప్రారంభించాడు.67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో దాదాపు 65,000 మంది వ్యాపారం చేసుకునేలా ఉంది.ఇంటర్నేషనల్ డైమండ్ మరియు జ్యువెలరీ వ్యాపారానికి అతిపెద్ద కేంద్రంగా ఇది మారనుందని అలాగే త్వరలో దీనివల్ల కొత్తగా 1.5 లక్షల మందికి ఉపాధి కలగబోతుందని చెప్పాడు.
అత్యధిక హాంగ్ లతో నిర్మించిన ఈ భవనాన్ని సూరత్ కి సమీపంలోని కాజోడు గ్రామంలో నిర్మించారు. 2015 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ భవనం 2022లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 3400 కోట్లతో భవనాన్ని నిర్మించారు. దీంట్లో దాదాపు 4500 కార్యాలయాలు ఉంటాయి. 4000 సీసీ కెమెరాల తో పటిష్టమైన భద్రతని ఏర్పాటు చేశారు. సూరత్ లో ఎక్కువగా వజ్రాల వ్యాపారం జరుగుతుందని మనకు ఇదివరకు తెలిసిందే. అయితే ఇక్కడ వజ్రాలను సాన పెట్టడం మరి పాలిష్ చేయడం వంటి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగే వ్యాపారం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడే అవకాశం కూడా ఉంది.
.