రెండు నెలల్లో హైదరాబాద్ లో డ్రగ్స్ ను నిర్మూలించాలని సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో సిటీ పోలీస్ బృందంతో ఆయన కీలక భేటీ నిర్వహించారు. నగరంలో డ్రగ్స్, గంజాయి అనే మాట వినపడవద్దని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఎవరైనా పైరవీలు చేస్తే అస్సలు సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. నగరంలో డ్రగ్స్ మాఫియాను అరికడతామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో ప్రకటించిన మరుసటి రోజే సీపీ కీలక భేటీ నిర్వహించడం ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను తెలంగాణలో లేకుండా చేయడం అధికారులు చర్యలు తీసుకోవడం శుభ పరిణామం అని పలువురు చర్చించుకుంటున్నారు. ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.