బ్రేకింగ్: 101 వస్తువులపై కేంద్ర రక్షణ శాఖ ఆంక్షలు

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ఆత్మ నిర్భర భారత్ ప్రకటనకు సంబంధించి కేంద్ర రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి గానూ… 101 విదేశీ వస్తువుల దిగుమతిపై కేంద్ర రక్షణ శాఖ ఆంక్షలు విధించింది. ఈ మేరకు 101 వస్తువుల జాబితాను సిద్దం చేసింది అని కాసేపటి క్రితం కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ ప్రకటన చేసారు. రక్షణ రంగంలో ఇది స్వావలంభన వైపు అడుగు అని ఆయన పేర్కొన్నారు.

opposition slams Rajnath singh russia tour

ఆ వస్తువుల దిగుమతులపై ఆంక్షలు ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు. ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టం, డెమోగ్రఫీ & డిమాండ్ అనే 5 స్తంభాల ఆధారంగా స్వయం ప్రతిపత్తి గల భారతదేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన పిలుపునిచ్చారని ఆయన అన్నారు. 101 ఆంక్షల వస్తువుల జాబితాలో సాధారణ వస్తువులు మాత్రమే కాకుండా… ఆర్టిలరీ గన్స్, అటాల్ట్ రైఫిల్స్, కొర్వెట్స్, సోనార్ సిస్టమ్స్, ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, ఎల్‌సిహెచ్, రాడార్లు మరియు మా రక్షణ సేవల అవసరాలను తీర్చే అనేక వస్తువులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news