ఈ మధ్యకాలంలో డయాబెటిస్ అనేది చాలా సాధారణంగా మారింది. ముఖ్యంగా చాలా శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు మరియు ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యగా మారింది. అయితే తగిన జాగ్రత్తలను తీసుకోకపోవడం వలన ఆరోగ్యం పై ఎంతో ప్రభావం పడుతుంది. ఎప్పుడైతే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ అవుతాయో, డయాబెటిస్ సమస్యతో బాధపడాల్సి వస్తుంది. పైగా చక్కెర స్థాయిలని సమతుల్యం చేయడం చాలా కష్టం అవుతుంది. అందువలన ఆహారంలో మార్పులు చేసుకోవడం ఎంతో అవసరం.
సహజంగా డయాబెటిస్ సమస్య తో బాధపడేవారు అన్నానికి బదులుగా చపాతీలు వంటివి తీసుకుంటారు మరియు పంచదార, బెల్లం వంటి తీయటి పదార్థాలను తగ్గించడం వంటివి చేస్తారు. అయితే అన్నంకు బదులుగా కేవలం చపాతీలు తీసుకోవడం మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను కూడా తీసుకోవచ్చు. అన్నంకు బదులుగా ఎంతో సులభంగా తయారు చేసుకుని పోహాను తీసుకోవచ్చు. దీనిని అటుకులతో తయారు చేస్తారు. అటుకులను నానబెట్టి, పల్లీలు, సెనగపప్పు వంటి పోపు దినుసులతో పోహాను ఎంతో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. పైగా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఈ మధ్యకాలంలో చాలా శాతం మంది అన్నంకు బదులుగా క్వినోవాను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనిలో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు చక్కర స్ధాయిలను సమతుల్యం చేసుకోవడానికి దీనిని తీసుకోవచ్చు. అలాగే, డయాబెటిస్ బాధపడేవారు ఓట్స్‌ను కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వలన తక్కువ సమయంలోనే ఆహారం జీర్ణం అవుతుంది. పైగా వీటిలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా, రక్తంలో చక్కర స్థాయిలను సమతుల్యం చేయడానికి ఓట్స్ ఎంతో సహాయపడతాయి అని నిపుణులు చెబుతున్నారు. కనుక రక్తంలో చక్కర స్థాయిలను సమతుల్యం చేయడానికి అన్నంకు బదులుగా ఈ ఆహార పదార్ధాలను తీసుకోండి.