గుజరాత్ వడోదరలో ఒక దారుణం చోటు చేసుకుంది. చేని పోలీస్ స్టేషన్ వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తున్న శక్తి సిన్హ్ ప్రవర పోలీస్ వ్యాన్ కు ఎదురువచ్చాడని పదమూడేళ్ళ బాలుడిని కొట్టిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శక్తి సిన్హ్ రోడ్డు పై వెళ్తున్న సమయంలో బాలుడు ఎదురు వచ్చాడు. అది గమనించిన శఙతి సిన్హ్ సుద్దెంగా బ్రేక్ వేసాడు.
ఇంతలో బాలుడు దుకాణంలో కొనుగోలు కోసం వెళ్లడం చూసి శక్తి సిన్హ్ వ్యాన్ దిగి దుకాణంలోకి వెళ్లి బాలుడిని కొట్టాడు. బాలుడు బయపడి వేరే దుకాణంలోకి పరిగెత్తాడు. ఆ పోలీస్ వెంబడించి మరీ కొట్టగా స్థానికులు సర్దిచెప్పడంతో శక్తి సిన్హ్ వెళ్ళిపోయాడు. ఈ ఘటన జరిగిన దుకాణంలో సీసీటీవీ ఉండటం వల్ల పోలీస్ చేసిన సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా జరిగి 24 గంటల సమయంలోనే బాలుడిపై అనుచితంగా ప్రవర్థించినందుకు స్పందించిన ఉన్నతాధికారులు శక్తి సిన్హ్ ను సస్పెండ్ చేసారు.