హిమాచల్ సంక్షోభం.. 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

-

హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇక్కడి రాజకీయాలు గంట గంటకూ ఊహించని మలుపులు తిరిగుతున్నాయి. ఇప్పటికే మాజీ సీఎం జైరాం ఠాకుర్‌ నేతృత్వంలోని బీజేపీ శాసనసభా పక్షం ఈరోజు రాష్ట్ర గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లాను కలిసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనుమతి కోరినట్లు సమాచారం.

మరోవైపు ఇవాళ్టి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేస్తూ స్పీకర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఛాంబర్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బీజేపీ ఎమ్మెల్యేలు జైరామ్ ఠాకూర్, విపిన్ సింగ్ పర్మార్, రణధీర్ శర్మ, లోకేందర్ కుమార్, వినోద్ కుమార్, హన్స్ రాజ్ సహా 15 మందిని బడ్జెట్‌ సమావేశాల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

మరోవైపు, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌ తన పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా రాజ్యసభలో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన రెబల్ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ ఉదయం వారు ప్రత్యేక చాపర్‌లో పంచకులను వీడి రహస్య ప్రాంతానికి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news