తండ్రి కాకపోవడంతో బెయిల్‌.. అసలైన తండ్రెవరు..?

-

ఇంటిపక్కనున్న ఓ యువతిపై అత్యాచారం చేసిన కేసులో వ్యక్తి 17 నెలల శిక్ష అనంతరం అతడికి బెయిల్‌ మంజూరైంది. డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా బాధితురాలి బిడ్డకు సదరు వ్యక్తి తండ్రి కాదని తేలడంతో కోర్టు బెయిల్‌ ముంజూరు చేసింది.అందుకు సంబం«ధించిన వివరాలు ఇలా.. పుట్టుకతోనే మూగ, చెవిటితో పుట్టిన ఆ యువతి పాఠశాలలో ఉండగానే విపరీతమైన కడపునొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రస్తుతం ఆమె గర్భవతిగా నిర్ధారించారు. అందుకు కారణమేంటని కుటుంబ సభ్యులు ఆరాతీయగా, బాధితురాలి పక్కింటి వ్యక్తే తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్ల వెల్లడైంది. దీంతో 2019 జూలై23న అతడిపై కేసు నమోదు కాగా, 17 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపాడు.

డీఎన్‌ఏ రిపోర్టు ఆధారంగా..

ఈ కేసులో తనను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని సదరు వ్యక్తి రెండుసార్లు బెయిల్‌ దాఖలు చేసినా ప్రాసిక్యూషన్‌ సందరు వ్యక్తి అభ్యర్థనను కొట్టిపారేసింది. ఒకవేళ నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తే, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొని అతడికి బెయిల్‌ మంజూరు తెలిపివేసింది. అయితే తాజాగా వెలువడిన డీఎన్‌ఏ రిపోర్టు ఆధారంగా ఆ యువతి బిడ్డకు నిందితుడిగా ఉన్న ఆ వ్యక్తి తండ్రి కాదని తేలడంతో అప్పుడు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

అయితే, దివ్యాంగురాలు జన్మనిచ్చిన ఆ బిడ్డకు తండ్రి ఎవరనే ప్రశ్న అలాగే మిగిలిపోయింది. కావాలనే నిందితునిపై ఆరోపణలు చేశారా? లేక డబ్బు చేతులు మారి డీఎన్‌ఏ రిపోర్టులో మార్పులు జరిగాయా అన్న సందేహాలు స్థానికుల్లో తలెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news