అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా చెప్పుకునే పండుగ రక్షాబంధన్. రాఖీ పండుగ రోజున ఎంత దూరంలో ఉన్నా సరే సోదరీ సోదరులు కలుసుకొని రక్షాబంధన్ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించుకొని కానుకలు అందుకుంటారు. ఇక ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున ఈ సమయంలో మాత్రమే రాఖీలు కట్టాలి అని ఓ సమయాన్ని పండితులు చెబుతూనే ఉంటారు. ఈ సంవత్సరం రాఖీ పండుగ శనివారం రోజున వచ్చింది.

ఇక శనివారం రోజున ఉదయం 5:56 నుంచి మధ్యాహ్నం 1:24 గంటల లోపు మాత్రమే రాఖీ కట్టుకునేందుకు శుభ సమయం అని పండితులు స్పష్టం చేశారు. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:53 గంటల వరకు అభిజిత్ ముహూర్తం ఉందని పండితులు చెప్పారు. రాత్రి 7:19 నుంచి 9:24 వరకు రాఖీలు కట్టుకోవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటికే కొంతమంది ఆడవారు వారి అన్నలు తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు ఇళ్లకు చేరుకుంటున్నారు.