ఆకతాయిలు వెంటపడ్డారని.. రైలెక్కి 140 కి.మీ. వెళ్లిన అమ్మాయిలు

-

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆకతాయిల నుంచి తప్పించుకునేందుకు ఇద్దరమ్మాయిలు గూడ్స్‌రైలు ఎక్కి 140 కి.మీ.లు ప్రయాణించారు. వారిని ట్రెయిన్‌ గార్డు కాపాడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 3వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారిని కాపాడిన ఆర్య అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు యువతుల కుటుంబాలకు సమాచారం అందించారు.

అసలేం జరిగిందంటే.. హాథ్రాస్‌కు చెందిన ఇద్దరు బాలికలు చీకటిపడ్డాక ట్యూషను నుంచి తిరిగివస్తుండగా కుర్రాళ్లు వెంటపడ్డారు. వాళ్ల నుంచి తప్పించుకునేందుకు పరుగు తీసి రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్సు బండి ఎక్కి నక్కి కూర్చున్నారు. ఇంతలో రైలు కదిలింది. ఏం చేయాలో పాలుపోని వాళ్లు రైల్లో అలాగే వెళ్లారు.

అలా 140 కి.మీ.లు రైలు ప్రయాణించిన తర్వాత ఇంట్లోవాళ్లకు సమాచారం ఇచ్చారు కానీ ఎక్కడ ఉన్నారో మాత్రం చెప్పలేకపోయారు. అయితే హాథ్రాస్‌ నుంచి బయలుదేరిన రైలు రాత్రి 11.00 గంటలకు ఇటావాలో నిలిచిన తర్వాత.. సంతకం చేసేందుకు స్టేషనులోకి వెళ్లబోయిన ఆర్య ప్లాట్‌ఫాం మీద కూర్చొని భయం భయంగా దిక్కులు చూస్తున్న ఈ ఇద్దరు బాలికలను గమనించి వివరాలు ఆరా తీశారు. వాళ్లు ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పారు. ఈ విషయం గురించి ఆర్య స్టేషను సూపరింటెండెంటుకు చెప్పడంతో ఆ అధికారి బాలికల పేరెంట్స్తో మాట్లాడి వాళ్లను సురక్షితంగా ఇళ్లకు పంపే ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version