భానుడి భగ భగ.. 48 గంటల్లో 25 మంది పోలింగ్ అధికారుల మృతి

-

తూర్పు భారత దేశంలో వారం రోజులు ఎండలు నిప్పుల వర్షాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ యూపీ, హర్యానా వంటి రాష్ట్రాలో ఎండలు మండిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతు.. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో బీహార్లో గత 48 గంటల్లో వేడిగాలుల కారణంగా కనీసం ఎనిమిది మంది పోల్ అధికారులు మరణించారు. జూన్ 1న జరగనున్న ఏడో దశ లోక్ సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మరో 10 మంది మరణించారని అధికారులు తెలిపారు.

18 మందిలో 11 మంది రోహతాస్ జిల్లాలో, ఆరుగురు భోజ్పుర్లో, ఒకరు బక్సర్లో ఎండల కారణంగా చనిపోయారు. అధికారుల ప్రకారం, గురువారం కూడా ఒడిశా 10. బీహార్ 8, జార్ఖండ్ 4, ఉత్తరప్రదేశ్ 1, రాజస్థాన్లో లో ఐదుగురు ఎండల కారణంగా చనియారు. ఇప్పటివరకు కనీసం ఐదుగురు వేడి సంబంధిత మరణాలు నమోదయ్యాయి. రానున్న వారం రోజుల పాటు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news