29 people died after drinking adulterated liquor in Tamil Nadu: తమిళనాడులో కల్తీ మద్యం తాగి 29 మంది మృతి చెందారు. తెలంగాణలో ఆ కల్తీ మద్యం ఆపకపోతే తమిళనాడులో జరిగిన ఈ దారుణం చూడవలసి వచ్చేది అని అంటున్నారు. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో నకిలీ మద్యం తాగి 29 మంది మృతి, 60 మంది పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన పై సీరియస్ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్, సీబీ – సీఐడీ విచారణకు ఆదేశించారు. అదే సమయంలో కలెక్టర్ శ్రావణ్‌కుమార్ జతావత్‌పై బదిలీ వేటు వేయగా, కళ్లకురిచ్చి జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేశారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం కూడా సొమ్ డిస్టిలరీస్ అనే ఒక నకిలీ మద్యం తయారీ సంస్థకు తెలంగాణలో మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకుంది.