BREAKING : జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి

-

జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే జరిగిన దాడుల్లో పదుల సంఖ్యలో జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి జమ్ముకశ్మీర్ లోని పరిస్థితులపై ఆరా తీశారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, రానున్న రోజుల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల ఉద్ధృతిపై అధికారులు అమిత్‌ షాకు వివరించారు.

మరోవైపు తాజాగా  దొడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఒక అధికారితో సహా నలుగురు జవాన్లు మృతి చెందారు. సోమవారం ఉగ్రవాదులకు, సైనికుల మధ్య జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో ఐదురుగు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని భద్రతా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం సమీక్షించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, రానున్న రోజుల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల ఉద్ధృతిపై అధికారులు అమిత్‌ షాకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news