హిమాచల్‌ ప్రదేశ్‌లో వరద బీభత్సం.. 45 మంది గల్లంతు

-

హిమాచల్‌ప్రదేశ్‌లో వరణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. రాంపుర్‌లో మెరుపువరదల కారణంగా ఈ రాష్ట్రంలో 45 మంది గల్లంతయ్యారు. వారి కోసం రెండ్రోజులుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారత సైన్యంతో పాటు  NDRF బృందాలు CISF, ITBP, SDRF సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా రాంపుర్‌కు 12 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 20 నుంచి 25 ఇళ్లు కొట్టుకుపోయాయి. మరోవైపు విద్యుత్‌ కేంద్రం సమీపంలో 29 మంది చిక్కుకున్నారు. గురువారం రోజున మలానా డ్యామ్‌ తెగిపోవడంతో వరద పోటెత్తి ఐదుగురు మృతి చెందారు. 49 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారు.

అయితే, ఆకస్మిక వరదల కారణంగా ఆ ప్రాంతంలో అనేక చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నాలుగు వంతెనలు కొట్టుకుపోయాయి. ఫలితంగా సహాయక బృందాలు చేరుకునేందుకు ఇబ్బంది ఎదురవుతోంది. మరోవైపు, హిమాచల్ ప్రదేశ్వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా బియాస్ నది ఉప్పొంగడం వల్ల అనేక చోట్ల చండీగఢ్-మనాలి జాతీయ రహదారి దెబ్బతింది. వరుణుడి బీభత్సం నేపథ్యంలో హిమాచల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news