మహారాష్ట్రలో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం

-

మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందరాఉ. మహారాష్ట్ర భండారా జిల్లాలోని ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఇక ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 12 మంది ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ ఘటన గురించి తెలిసి.. వెంటనే రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది దిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

5 Feared Dead In Massive Explosion At Ordnance Factory In Maharashtra’s Bhandara

మంటలు చెలరేగడంతో.. కమ్ముకుంది దట్టమైన పొగ. ఇక ఈ ప్రమాదంతో.. భయాందోళనలకు గురయ్యారు స్థానిక ప్రజలు. కాగా పేలుడు సమయంలో పైకప్పు కూలిపోయిందని, కనీసం 12 మంది దాని కింద ఉన్నారని మిస్టర్ కోల్టే చెప్పారు. వారిలో ఇద్దరిని రక్షించామని, శిథిలాలను తొలగించేందుకు ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగిస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news