550 pilgrims died in Hajj: BREAKING: హజ్ యాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏకంగా 550 మంది యాత్రికులు మృతి చెందారు. ఈ ఏడాది హజ్ యాత్రలో ఇప్పటివరకు 550 మందికిపైగా యాత్రికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో అత్యధికంగా 323 మంది ఈజిప్షియన్లు ఉన్నారని పేర్కొన్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/06/550-pilgrims-died-in-Hajj.jpg)
తీవ్ర ఎండలు, ఉక్కబోత వాతావరణమే మరణాలకు కారణమని చెప్పారు. 22 దేశాలకు చెందిన 16 లక్షల మందితో కలిపి ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని వెల్లడించారు. కాగా, గత ఏడాది 240 మందికిపైగా యాత్రికులు మరణించారు.