శబరిమల ఆలయం తెరుచుకున్న రోజు నుంచి దేశనలుమూలల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు ఆ పుణ్యక్షేత్రానికి పోటెత్తుతున్నారు. అయితే శబరిమలకు వెళ్లాలనుకునే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఇటీవలే ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లి వచ్చే భక్తుల సౌకర్యార్థం మరో 64 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
ఈ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…
- సికింద్రాబాద్-కొల్లం మధ్య డిసెంబరు 10, 17, 24, 31, జనవరి 9, 14
- నర్సాపూర్-కొట్టాయం మధ్య డిసెంబరు 10, 17, 24, 31, జనవరి 7, 14
- తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి సికింద్రాబాద్‌కు డిసెంబరు 12, 19, 26, జనవరి 9, 16
- కొట్టాయం నుంచి నర్సాపూర్‌కు డిసెంబరు 11, 18, 25, జనవరి 1, 8, 15
- శ్రీకాకుళం రోడ్-కొల్లం ప్రత్యేక రైళ్లు నవంబరు 25, డిసెంబరు 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20, 27
- విశాఖపట్నం-కొల్లం మధ్య నవంబరు 29, డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17, 24, 31
- కొల్లం నుంచి శ్రీకాకుళం రోడ్‌కు నవంబరు 26, డిసెంబరు 3, 10, 17, 24, 31, జనవరి 7, 1,4, 21, 28
- కొల్లం నుంచి విశాఖపట్నానికి నవంబరు 30, డిసెంబరు 7, 1,4, 21, 28 జనవరి 4, 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.