కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ తో సహా మొత్తం 10 మంది మావోయిస్టులు మరణించారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనలో ముగ్గురు తెలంగాణ గ్రేహౌండ్స్ జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో వీరు మరణించగా.. పలువురు జవాన్లు
గాయపడ్డారని, వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సోషల్
మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఛతీస్ గడ్ బీజాపూర్ లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించినట్టు సమాచారం. ఇక నిన్న జరిగిన ఎదురుకాల్పులలో దాదాపు 22 మంది మావోయిస్టులు మరణించారు.