జేబుల నిండా లక్షల డబ్బులున్నా ఆకలితో బిక్షగాడు మృతి..!

-

అతను ఎవ్వరో అనేది అసలు ఈ ప్రపంచానికే తెలియదు. కానీ అతని మరణం మాత్రం పోలీసులకు పలు ప్రశ్నలను మిగిల్చింది. 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యాచకుడి వద్ద లక్షల నగదు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. దాదాపు రూ.1.14 లక్షల నగదు అతని వద్ద లభ్యమైంది. చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చేరిన ఆ వృద్ధుడు.. చికిత్స ప్రారంభించిన కాసేపటికే కన్నుమూశాడు. పోస్టుమార్టం నివేదికలో ‘ఆకలి’ అతని చావుకు కారణమని అధికారులు తెలిపారు.అంత డబ్బు ఉన్న ఆకలితో ఎందుకు చనిపోయాడు? అతనికి ఆ డబ్బు ఎలా వచ్చింది? వంటి ఎన్నో ప్రశ్నలు పోలీసుల బుర్రలను తొలుస్తున్నాయి.

వల్సాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గాంధీ లైబ్రరీ సమీపంలోని రోడ్డు పక్కన గత రెండు రోజులుగా అదే స్థలంలో బిచ్చగాడు పడి ఉండటాన్ని ఓ దుకాణం యజమాని గమనించాడు. దీంతో అతను 108కి డయల్ చేసి ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించాడు. వృద్ధుడికి సృహరాగానే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భవేష్ పటేల్ అతని వద్దకు వెళ్లి మాట్లాడారు. ప్రాథమిక పరీక్షల అనంతరం చికిత్స నిమిత్తం సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బిచ్చగాడు చనిపోయాడు. రోజుల తరబడి ఆకలితో అలమటించడం మూలంగా వృద్ధుడు మరణించినట్లు వల్సాద్ సివిల్ హాస్పిటల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వ్యక్తి మృతితో అతని వద్ద ఉన్న రూ.1.14 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news