BREAKING : ఢిల్లీలో భారీ భూకంపం

-

BREAKING :  ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 20 సెకన్ల పాటు కపించడంతో భయంతో జనాలు ఇళ్ళనుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.4గా నమోదైనట్లు తెలుస్తోంది. నేపాల్ లో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు తెలిపారు. అటు యూపీ, బీహార్ లలోను ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా.. నేపాల్​లో భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటి వరకు దాదాపు 69 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత జాజర్​ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version