భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా స్వల్ప మార్పు చోటు చేసుకుంది. అక్టోబర్ 01న ప్రధాని రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి మోడీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి 1.35 కి హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ బయలు దేరారు. 2.05 కి అక్కడికే చేరుకొని 2.15 నుంచి 2.50 వరకు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ సమరభేరీ సభ స్థలానికి చేరుకొని 4 గంటల వరకు అక్కడే ఉంటారు. సభా వేదిక నుంచి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని మోడీ పూరించనున్నారు. సభ అనంతరం హెలికాప్టర్ లో తిరిగి శంషాబాద్ చేరుకొని అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్తారు ప్రధాని. తొలుత ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి మహబూబ్ నగర్ వెళ్లనున్నట్టు గతంలో బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కానీ స్వల్ప మార్పు జరిగినట్టు తాజాగా షెడ్యూల్ గురించి వివరించింది బీజేపీ.