దిల్లీ లిక్కర్ స్కామ్.. ఈడీ ఛార్జ్‌షీట్‌ నిందితుల జాబితాలో ఆప్‌

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ , సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్లను నిందితులుగా ప్రస్తావించనున్నట్లు తెలిసింది. ఈడీ చరిత్రలో తొలిసారి ఓ జాతీయ పార్టీ పేరును నిందితుల జాబితాలో చేర్చినట్లవ్వనుంది. ఆ పార్టీ ఆస్తుల్లో కొన్నింటిని అటాచ్‌ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

సుప్రీం కోర్టులో నేడు కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌పై విచారణ అనంతరం ఈ ఛార్జ్‌షీట్‌ను సమర్పించే అవకాశం ఉంది. ఈరోజంతా వాదనలు జరిగితే రేపు ఛార్జ్షీట్ సమర్పించొచ్చు. ఇందులో కేజ్రీవాల్‌ సహా మరికొందరు నిందితులు, వారికి సంబంధించిన సంస్థల పేర్లను కూడా ప్రస్తావించనున్నట్లు ఈడీ వర్గాల సమాచారం. డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి చేరిందనేది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దీనిలో నిరూపించే అవకాశాలున్నాయి. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద వీరిపై కేసులు ఫైల్‌ చేయనున్నారు. cరోవైపు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశంపై సుప్రీంకోర్టు నేడు వాదనలు విననుంది. దీన్ని ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news