ఆదిత్య L-1 కౌంట్‌ డౌన్ షురూ

-

భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) మరో చరిత్రాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తోంది. మొన్న చంద్రయాన్-3తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్ ఇప్పుడు సూర్యుడి గుట్టును తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే భూమి నుంచి సూర్యుని దిశగా 15లక్షల కిలోమీటర్ల దూరంలోని తొలి లాగ్రాంజియన్‌ పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలో ఆదిత్య ఎల్​1ను ఇస్రో ప్రవేశపెట్టనుంది. తద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుందని తెలిపింది.

సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఆదిత్య ఎల్‌-1లో పేలోడ్‌లను రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్‌, మాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయని పేర్కొంది. భూమిపై జీవరాశుల మనుగడకు కారణమైన సూర్యుడి భూత భవిష్యత్‌ వర్తమానాలకు సంబంధించి సరికొత్త సమాచార సేకరణకు ఎంతగానో సహకరించనున్న ఆదిత్య ఎల్​1 ప్రయోగానికి తిరుపతి జిల్లాలోని సతీశ్‌ దావన్‌ అంతరిక్ష కేంద్రం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది.

Read more RELATED
Recommended to you

Latest news