ఒకే ఫ్రేమ్‌లో భూమి-చంద్రుడు.. సెల్ఫీ ప్లీజ్ అంటూ క్లిక్​మనిపించిన ఆదిత్య-ఎల్‌1

-

చంద్రయాన్-3ను జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దింపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆ తర్వాత సూర్యుడి గుట్టు విప్పే పనిలో పడింది. ఇందులో భాగంగానే.. సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య- ఎల్ 1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. సెప్టెంబర్‌ 2వ తేదీన ఆదిత్య ఎల్‌-1ను పీఎస్‌ఎల్‌వీ-సీ57 వాహక నౌక ద్వారా ఇస్రో నిర్దేశిత భూకక్ష్యలో ప్రవేశపెట్టగా..  ఈ శాటిలైట్ గమ్యం దిశగా సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు కక్ష్య పెంపు ప్రక్రియలూ చేపట్టింది.

అయితే తన ప్రయాణంలో ఆదిత్య ఎల్‌-1 సెల్ఫీ తీసుకుంది. అంతే కాదు భూమి, చంద్రుడిని కూడా తనలో ఉన్న కెమెరా లెన్స్​లో బంధించింది. ఆ చిత్రాలను ఇస్రో…సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒకే ఫ్రేములో ఉన్న భూమి-చంద్రుడితో ఆదిత్య ఎల్-1 సెల్ఫీ తీసుకుంది.

ఇక 16 రోజుల పాటు భూ కక్ష్యల్లోనే చక్కర్లు కొట్టనున్న ఆదిత్య-ఎల్‌1 అనంతరం భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్దేశిత లంగ్రాజ్‌-1 బిందువు దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మొత్తంగా ఇందుకు నాలుగు నెలలకుపైగా సమయం పట్టనుంది.

Read more RELATED
Recommended to you

Latest news