ఏపీలో తెలుగుదేశం పార్టీకి కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు కష్టపడుతున్నారు. కానీ అందుకు తగ్గట్టుగా పార్టీ బలోపేతం అవ్వడం లేదు. ఇప్పటికీ ప్రజలు జగన్ వైపే ఉన్నారు. ఇక ఎలాగోలా ప్రజల్లోకి వచ్చి తిరుగుతున్న సరే అనుకున్న మేర టిడిపికి మైలేజ్ రావడం లేదు. పైగా రివర్స్ లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
ప్రస్తుతం టిడిపికి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి. అధికార వైసీపీ ఎక్కడకక్కడ టిడిపిని కార్నర్ చేసేస్తుంది. ఇటీవల బాబుకు 118 కోట్ల స్కామ్ విషయంలో ఐటీ నోటీసులు రావడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేతలు..బాబుని టార్గెట్ చేశారు. బాబు అవినీతి బయటపడిందని కామెంట్లు చేస్తున్నారు. ఓ వైపు వైసీపీ మీడియా, మరోవైపు వైసీపీ నేతలు ఈ ఐటీ నోటీసులపైనే స్పందిస్తున్నారు. ఇంకా వేరే పని పెట్టుకోకుండా బాబుకు ఐటీ దెబ్బ అంటూ చుక్కలు చూపిస్తున్నారు. ఈ అంశం టిడిపికి బాగా నెగిటివ్ అవుతుంది.
ఇదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర చప్పగా సాగుతుంది. పాదయాత్ర గురించి ప్రజల్లో చర్చ లేదు. జనం కూడా పాదయాత్రలో పాల్గొనడం లేదు. ఇక తాజాగా పాదయాత్రపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంతో టిడిపికి భారీ షాక్ తగిలింది. ఈ క్రమంలో టిడిపి శ్రేణులపై కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలు టిడిపి కార్యకర్తలని ఢీలా పడేలా చేశాయి.
అటు టిడిపి నేతలు కూడా నిరాశలో ఉన్నారు. అసలు జగన్ రాష్ట్రంలో లేకపోయినా..వైసీపీ నేతలు తమదైన శైలిలో టిడిపికి చుక్కలు చూపిస్తూ ముందుకెళుతున్నారు. ఇదే ఎన్నికల వరకు కొనసాగితే ఇంకా టిడిపికి మళ్ళీ అధికారం దక్కడం అనేది కల.