కాంగ్రెస్ పార్టీ “వార్ రూమ్” లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నేతల సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమాజంపై ఈ సమీక్షని నిర్వహించారు. ఏఐసిసి అధ్యక్షుడు అయున తర్వాత తొలిసారిగా పార్టీ “టాస్క్ ఫోర్స్” సమావేశం నిర్వహించారు మల్లిఖార్జున ఖర్గే. 2024 సార్వత్రిక ఎన్నికల కు సమాయత్తం పై ఈ సమావేశంలో చర్చించారు.
అన్ని రాష్ట్రాల్లో శ్రేణులను సమాయత్తం చేసేందుకు కార్యాచరణ ను రూపొందించనునుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచనా కేంద్రమైన “వార్ రూమ్” లో జరుగుతున్న సమావేశంలో పాల్గొన్నారు ఏఐసిసి సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కే. వేణుగోపాల్, సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేశ్, రాజీవ్ శుక్లా, సచిన్ పైలట్ తదితరులు. రాహుల్ గాంధీ చేపట్టిన “భారత్ జోడో” యాత్ర ప్రభావం, ప్రజల్లో వస్తున్న స్పందన పై కూడా చర్చించారు. మరింత ప్రభావవంతంగా “భారత్ జోడో” యాత్ర ఉండేలా నేతల నుంచి సూచనలు తీసుకుంటున్నారు ఖర్గే.