పాము తనను తానే కాటేసుకుంటే..ఏం అవుతుంది.. చనిపోతుందా..?

-

గన్‌ క్లీన్‌ చేస్తుండగా పొరపాటున పేలి చనిపోయిన కానిస్టేబుల్‌, సీఐ ఇలాంటి వార్తలను మనం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం.. ప్రమాదాన్ని పాకెట్‌లో పెట్టుకుని తిరిగితే అది ఒక్కోసారి మనకే హాని చేయొచ్చు.. అలాంటిది.. విషంతో నిండిన పాము ఎవరినైనా కాటేస్తే చనిపోతారు.. ఒకవేళ..ఏంటి ఒకవేళ.. పాము తనను తానే కాటేసుకుంటే.. వేసుకోదు అంటారేమో.. జస్ట్‌ ఇమాజిన్‌ వేసుకుంటే ఏమైతుంది..? చనిపోతుందా..? దాని విషం దానికి ఏం కాదంటరా..?
పాము విషం దాని నోటిలోని విష గ్రంధుల్లోనే ఉంటాయి. తనకు ఇతర జీవుల నుంచి ఏదైనా అపాయం ఉందన్నగానే వెంటనే కాటేస్తుంది. దీంతో విషం శరీరంలోకి ప్రవేశించి ఆ జీవి మరణిస్తుంది. ఉదాహరణకు పాము ఎలుకను కాటేసి మింగేసింది అనుకుందాం.. అప్పుడు పాము వదిలిన విషం ఎలుకతో పాటు దాని కడుపులోకి వెళ్తుంది. అయితే ఇలా విషం కడుపులోకి వెళ్లినా దానికి ఏం జరగదు. దీనికి కారణం పాము పొట్టలో ఉండే యాసిడ్స్‌ విషాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. సో.. ఆ విషం దానిపై ఎలాంటి ప్రభావం చూపదు.
ఒకవేళ పాము తనను తాను కరుచుకుంటే విషం దాని రక్తంలోకి వెళుతుంది. అయినా..పాముకు ఏం కాదు.. కారణం.. పాము నోట్లో నుంచి విషం అడపాదడపా కడుపులోకి వెళుతుంది. దీంతో పాములో ఉండే సహజ రోగ నిరోధక శక్తి క్రమంగా ఆ విషాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఆ విషానికి విరుడుగా యాంటీ డోస్‌ను తయారు చేసుకుంటుంది. పాము రక్తంలో అప్పటికే విషానికి విరుడుగా యాంటీ టాక్సిల్స్‌ తయారవుతాయి కాబట్టి పాముకు విషంతో ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే ఒక జాతికి చెందిన పామును మరో జాతికి చెందిన పాము కరిస్తే మాత్రం చనిపోయే ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నాయి.
భలే ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ.. దాని విషమే కాబట్టి..అలవాటై పోవడం వల్ల ఏం కాదు..వేరే జాతి పాము విషం అంటే.. విషం మారిపోతుంది..సో కాటేస్తే చనిపోయే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news