ఎయిర్ఇండియా సిబ్బంది సమ్మె విరమణ.. ఉద్యోగుల తొలగింపు వెనక్కి!

-

ఎయిర్ ఇండియా యాజమాన్యం, విమాన సిబ్బంది మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగినట్లు సమాచారం. రెండు రోజులుగా ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు సమ్మె విరమించారు. అనారోగ్య కారణాలతో మూకుమ్మడి సెలవు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎయిరిండియా 25 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరింత మందిని తొలగిస్తామని అల్టిమేటమ్ జారీ యేడంతో ఉద్యోగులు దిగి వచ్చి సమ్మెను విరమించారు.

ఈ క్రమంలో సిబ్బంది తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సహా వారిపై పెట్టిన కేసులను సమీక్షించేందుకు ఎయిర్ ఇండియా యాజమాన్యం అంగీకరించినట్లు సమాచారం. తక్కువ వేతనం, సమానత్వం వంటి విషయాల్లో యాజమాన్యం తీరుపై అసంతృప్తితో ఉన్న 300 మంది సిబ్బంది సామూహిక సెలవు పెట్టడం వల్ల వందల సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. సిబ్బంది తీరుపై ఆగ్రహించిన యాజమాన్యం, 25 మందిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామనీ, గురువారం సాయంత్రంలోగా మిగిలిన వారు విధుల్లో చేరకుంటే మరిన్ని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సిబ్బంది దిగివచ్చి సమ్మె విరమించారు.

Read more RELATED
Recommended to you

Latest news